5వ తేదీన సీఎం పర్యటన అడ్డుకుంటాం
బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల హెచ్చరిక
5వ తేదీన సీఎం పర్యటన అడ్డుకుంటాం
బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల హెచ్చరిక
ప్రస్తుతం విద్యా రంగ సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
కరీంనగర్ నవంబర్ 17:
పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిదొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు.
నగరంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని ఈనెల 25వ తేదీన సీఎం పర్యటన సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు , నిరసన కార్యక్రమంతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ , జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ , విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నా రోజు రాకేష్ చారి పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందించడం కూడా లేదన్నారు రాష్ట్రంలో 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బిసి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేవన్నారు విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం వలన తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు కూరుకుపోయాయి అన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పైన స్పందించి రాష్ట్రములో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు లేదంటే బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోకల విజయ్ , కొట్టే శివ, బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు