బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ హన్మకొండ డివిజన్ అధ్యక్షులు గా నార్లగిరి మహేందర్
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ హన్మకొండ డివిజన్ అధ్యక్షులు గా నార్లగిరి మహేందర్
ఎల్కతుర్తి డిసెంబర్ 10:
మంగళవారం నాడు హన్మకొండ లోని ప్రెస్ క్లబ్ లొ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిధి గా బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థపాక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ పాల్గొన్నారు. హన్మకొండ డివిజనల్ అధ్యక్షులుగా ఎల్కతుర్తి మండలం వీరానారాయణపూర్ గ్రామానికి చెందిన నార్లగిరి మహేందర్ ను నియమించినట్లు ప్రకటించారు.
నార్లగిరి మహేందర్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నన్ను నియమించిన వ్యవస్థపాక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు.జనాభాలో సగభాగమైన బిసిలు అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని, బిసిల కొరకు పోరాటం చేస్తామని తెలిపారు.