గాంధీ ఆసుపత్రికి మెడికల్​ ఎక్విప్​ మెంట్ అందచేసిన అమెరికా డాక్టర్​

On
గాంధీ ఆసుపత్రికి మెడికల్​ ఎక్విప్​ మెంట్ అందచేసిన అమెరికా డాక్టర్​

గాంధీ ఆసుపత్రికి మెడికల్​ ఎక్విప్​ మెంట్ అందచేసిన అమెరికా డాక్టర్​

సికింద్రాబాద్​ డిసెంబర్​ 12 (ప్రజామంటలు):

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) డాక్టర్ దివేష్ ఆర్ అనిరెడ్డి USA సహకారంతో గాంధీ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ కు గురువారం వైద్య పరికరాలను అందించారు. ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన ₹27 లక్షల విలువ చేసే అడ్వాన్స్​డ్​ ఏసోఫెగల్  అండ్ అనాల్ మనోమెట్రీ మిషను ను గాంధీ మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ ఇందిరా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి, గ్యాస్ర్టోఎంట్రాలజీ డిపార్ట్​ మెంట్ హెచ్​ఓడీ  డా.శ్రవణ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ మెడికల్ ఎక్విప్​ మెంట్​ తో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించగలుతుగామని గ్యాస్ర్టో ఎంట్రాలజీ డిపార్ట్​ మెంట్​ హెచ్​ఓడీ డాక్టర్​ శ్రవణ్​ కుమార్​ తెలిపారు.  కార్యక్రమంలో ఆర్​ఎంఓ–1  డా, శేషాద్రి, కిమ్స్​ వైద్య నిపుణులు డాక్టర్​ నితీష్​ ప్రతాప్​​, TDF ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, పీజీ డాక్టర్లు డా.అనిల్​, డా.దృవ, డా.ప్రియాంక, డా.స్నేహిత, డా.మరియం, సిబ్బంది  పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి గ్యాస్ర్టో ఎంట్రాలజీ డిపార్ట్ మెంట్​ కు మెడికల్ ఎక్విప్​ మెంట్ ను అందచేసిన టీడీఎఫ్​ ఆర్గనైజర్లను  పలువురు అభినందించారు. 
–––––––––

Tags