శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కార్తీక సమారాధన.

On
శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కార్తీక సమారాధన.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు) : 

జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు.

మాతలు విశేష సంఖ్యలో పాల్గొని సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఆలయ ఆవరణలో అన్నప్రసాద వితరణ చేశారు.

బ్రాహ్మణ బంధువులకు కార్తీకమాసం సందర్భంగా భోజన అనంతరం దక్షిణ తాంబూలాలు అందజేశారు.

విష్ణు సహస్రనామ పారాయణంతో ఆలయం అంతా మారు మోగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

మూలమూర్తులను దర్శించుకుని భక్తులు నేత్రానంద భరితులయ్యారు.

Tags