ఇన్స్పైర్ అవార్డులలో జాతీయస్థాయికి ఎంపిక కావాలి. - జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :
గత నెలలో స్థానిక ఓల్డ్ హై స్కూల్ జగిత్యాల లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనలలో ఎంపికైన 22 మంది విద్యార్థులు ఈనెల 7 నుండి 9 వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరుగుచున్న రాష్ట్రస్థాయి రాజ్య స్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన , రాష్ట్ర ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన లో పాల్గొనుటకు వెళుతున్న విద్యార్థుల బస్సుకు సోమవారం మధ్యాహ్నం 12:30 ని.లకు. అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... రాష్ట్రస్థాయి ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై మన జగిత్యాల జిల్లాకు గుర్తింపు తేవాలని వారు కోరారు ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ సెక్టోరియల్ ఆఫీసర్ రాజేష్ డిసిఇబి సెక్రెటరీ మురళీ మనోహర చారి పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు గైడ్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.