హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గంలో 50 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంఖు స్థాపనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ జనవరి 06:
హుస్నాబాద్ నియోజవర్గం అక్కన్నపేట్ మండలం రామవరం గ్రామంలో 25 కోట్లతో రామవరం నుండి హుస్నాబాద్ వరకు 11.8 కిలోమీటర్ల సింగిల్ లెన్ రోడ్డు ను డబుల్ రొడ్డుగా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖు స్థాపన చేసిననారు.
కొత్తకొండ లో కొత్తకొండ నుండి అంతక్కపేట వరకు 25 కోట్లతో సింగిల్ లైన్ డబుల్ లైన్ గా రోడ్డు మార్చడానికి శంఖు స్థాపన చేశారు.
*మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,రామవరం గ్రామ ప్రజలు కోరిక మేరకు 25 కోట్లతో హుస్నాబాద్ నుండి రామవరం కి డబుల్ రోడ్డు కి శంఖు స్థాపన చేసుకున్నాం..10 నెలల్లో ఈరోడ్డును పూర్తి చేయాలని అధికారులను , కాంట్రాక్టర్లను కోరుతున్నా .ఇక్కడి నుండి కొమురవెల్లి పోవడానికి రోడ్డు వేస్తాం అని అన్నారు.
డబుల్ రోడ్డు తరువాత రోడ్డు కి ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలి.ఇబ్బందులున్నా ఏడాది గడిచింది.ఏడాది మరింత కష్టపడి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తం.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ ,ఆరోగ్య శ్రీ 5-10 లక్షలకు పెంచుకున్నం.సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చాం.రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశాం. ఇందిరమ్మ ఇళ్లు సర్వే జరుగుతుంది.40 శాతం డైట్ చార్జీలు పెంచాం.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఆర్థిక పరిస్థితి తెలుసు.వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా 12 వేలు ఇస్తాం.గుట్టలు ,రాళ్ళు తప్ప అన్నిటికి ఇస్తాం.భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద జనవరి 26 నుండి 12 వేలు ఇస్తున్నాం..
గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు.26 జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.మేము వచ్చే సరికి గల్లా ఖాళీ అయింది..
అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి.నియోజకవర్గంలో బస్సులు పెంచాం.ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టు కి నిధులు మంజూరు అయ్యాయి .
కాలువలకు భూ సేకరణ జరుగుతుంది.. రైతులు కాలువలకు భూములు ఇవ్వాలి..ఈ ప్రాంతానికి సాగు నీరు ఇచ్చి సస్యశ్యామలం చేస్తం.
నీరు వాతావరణం కాలుష్యం అయ్యే పరిశ్రమలు కాదు .. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తెచ్చి పారిశ్రామిక కారిడార్ చేస్తం.అభివృద్ధిలో హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో కంటే ఆదర్శంగా ఉంచేలా కృషి చేస్తునన్నానని తెలిపారు
కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి , సింగిల్ విండో చైర్మన్ శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు.