సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :
జిల్లా "తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్" నిర్వహిస్తున్న సఖి - కేంద్రము - జగిత్యాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే మహిళలు పని చేసే చోట కలిగే ఇబ్బంధులని గురించి మహిళలపై లైంగిక దాడి చట్టము పై కూడా అవగాహన కార్యక్రమాలను చేపపట్టాలి అని అలాగే జిల్లా కలెక్టర్ సముదాయము నందు పని చేస్తున్న ఉద్యోగులందరికి కూడా అవగాహన కలిగే విధముగా కార్యక్రమములు చేపట్టాలి అని సూచిస్తూ సఖి సిబ్బంది పని తీరు ను అబినందించారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా సంక్షేమ అదికారి -జగిత్యాల జిల్లా డాక్టర్ నరేష్ , తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈవో అటుకుల శ్రీనివాస్, సఖి కేంద్రం సి ఏ కట్కూరి లావణ్య సఖి సిబ్బంది పాల్గొన్నారు.