వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

On
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)

 తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో,  అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

క్షేత్ర ప్రాధాన్యత

 అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు  ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.

ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు

శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ,  భక్తాంజనేయ, మార్కండేయ,  అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి  ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

        IMG-20250107-WA0349

 "ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు,  అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం  మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి,  రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి,  ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.

Tags

More News...

Local News 

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు    గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
Local News 

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం  జనవరి 07 (ప్రజా మంటలు):   ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్  పాఠశాల  విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...
Local News  State News 

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :  ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు...
Read More...
Local News  State News 

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  జిల్లా "తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్" నిర్వహిస్తున్న సఖి - కేంద్రము - జగిత్యాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలు...
Read More...
Local News 

కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం 

కదిలెల్లిన సార్లు -  విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన...
Read More...
Local News  State News 

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :  సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను (...
Read More...
National  International   State News 

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం సినీ నటుడు అజిత్ కార్ రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం  చెన్నై జనవరి 07: నటుడు అజిత్ కారు ప్రమాదం నుండి బయటపడ్డారు.దుబాయ్‌లో కార్ రేస్ ప్రాక్టీస్ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.కారు ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Read More...
Local News  State News 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండిప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 07:   ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత  విప్...
Read More...
National  State News 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు,  ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు న్యూ ఢిల్లీ జనవరి 07: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి...
Read More...
National  State News 

బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి హైదరాబాద్‌ జనవరి 07:: హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి   కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ కాంగ్రెస్,...
Read More...
Local News  State News 

గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత

గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత మంత్రి బండి సంజయ్ ఆరా కరీంనగర్ జనవరి 07 :  కరీంనగర్ పట్టణం లోని శర్మనగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు రాత్రి కాలీఫ్లవర్, సాంబార్ తో భోజనం చేసి, స్టడీ అవర్స్ ముగించుకుని వారి...
Read More...
National 

అస్సాం వరదల్లో చిక్కుకొన్న  బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి 

అస్సాం వరదల్లో చిక్కుకొన్న  బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి  అస్సాం వరదల్లో చిక్కుకొన్న  బొగ్గు గని కార్మికులు - ముగ్గురి మృతి  రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.  గౌహతి జనవరి 07: అస్సాంలో వరదల కారణంగా గనిలో చిక్కుకున్న బొగ్గు గని కార్మికులను రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అస్సాంలోని దిమా హసావో జిల్లాలోని మారుమూల బొగ్గు గనులలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులలో కనీసం...
Read More...