ముగ్గురు (3) పేద యువతుల పెళ్ళిళ్లకి చేయూత. - భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు) :
- కొండాపూర్ గ్రామానికి చెందిన "గాజూరి విజయలక్ష్మి - కీ.శే. శ్రీనివాసాచారి" కూతురు "అశ్విని"
- రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన "అట్కాపురం రాజన్న - రాజవ్వ" కూతురు "ప్రవళిక".
- స్థానిక జగిత్యాల కు చెందిన "పేరాల గంగాధర్ - రాధ" కూతురు "నిఖిత".
అనే ముగ్గురు యువతుల వివాహం నిశ్చయం అయ్యింది.
వారి కుటుంబాలు ఆర్థికంగా మరియు ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందుల్లో ఉండి ఎటువంటి ఆధారం లేక పోవడం వలన వారి బంధువులు మన సత్యసాయి సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే వీలైన సహాయం అర్థించడం జరిగింది.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో సంస్థ ద్వారా తక్షణమే స్పందించి భక్తులు శ్రీ గోగుల శశిధర్ - దీప్తి , వూటూరి భాస్కర్ - గంగ, వడ్ల మురళి - సుమ, గుండ రాజశేఖర్ - అర్చన, చిటుమల్ల లక్ష్మీనారాయణ - జయశ్రీ , చౌడారపు శ్రీనివాస్ - శైలజ, బట్టు రాజేందర్ - శ్రీలత గార్ల ఆర్థిక సహకారంతో అమ్మాయిల వివాహం నకు కావలసిన ముఖ్య వస్తువులైన దాదాపు ఒక్కొక్కరికి *14,000 రూపాయల విలువ గల బంగారు మంగళ సూత్రం , వెండి మెట్టెలు, పెళ్లి చీర , మంగళ హారతి సెట్, కన్యాదాన తాంబూలం మరియు చెంబు, స్టీల్ బిందె , ప్లేట్లు , గ్లాసులు తదితర వస్తు సామాగ్రిని, అలాగే 25KGs బియ్యం ను* ఈ రోజు అందచేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో సత్యసాయి సంస్థ తరపున కన్వీనర్ బట్టు రాజేందర్, ఎర్ర సత్తయ్య , గుండ రాజశేఖర్, వూటూరి భాస్కర్ , గోలి రాజేశ్వర్ రెడ్డి, అమనగంటి నాగభూషణం, మామిడాల చంద్రయ్య , గందె శ్రీకంత్ , గట్టు రాజేందర్, గూడూరు మురళీధర్ రావు, జైశెట్టి రాజ్ కిషన్, ఠాకూర్ నారాయణ్ సింగ్, ఎర్రోజుల రాజశేఖర్ మరియు మహిళా సభ్యులు జయశ్రీ , శ్రీలత , అర్చన తదితరులు పాల్గొన్నారు.మరియు గ్రామస్థులు రత్నాకర్ రావు, ముబారక్ , పిప్పరి అనిత , బర్ల అర్చన కూడా పాల్గొన్నారు.