రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం - సంక్రాంతి కానుకగా నూతన రేషన్ కార్డులు
రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం - సంక్రాంతి కానుకగా నూతన రేషన్ కార్డులు
ఎల్కాతుర్తి జనవరి 06: (ప్రజా మంటలు9:
(కందుకూరి రాజన్న)
.సాగు చేసే భూమికే రైతు భరోసా, గుట్టలు పుట్టలు, రాళ్లు రప్పలకు రైతు భరోసా బంద్.భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి అన్నారు.
.సంక్రాంతి కానుకగా ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 12 వేల రూపాయల సహాయం చేస్తూ,మాట కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వం మదని ఆయన అన్నారు.
శనివారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షాన జరిగిన క్యాబినెట్ సమావేశంలో భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 హార్దిక సాయంతో పాటు సంక్రాంతి కానుకగా నూతన రేషన్ కార్డులు సాగు చేసే భూమికే రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 12 వేల రూపాయల ఆర్థిక సాయం క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మరియు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటనతో మరియు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన సన్నవడ్ల పంటలు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి క్వింటాకు 500 బోనస్ రూపంలో రైతులకు నగదును అందించగా 2 లక్షల రుణమాఫీ కట్టుబడి రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రమంత్రి రేవంత్ రెడ్డికి మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ల చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కులము మతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో రూపొందించిన మేనిఫెస్టో దశల వారిగా అమలు చేస్తూ వస్తుందని గత ప్రభుత్వంలో రోడ్లు గుట్టలు రాళ్లు రప్పలు వెంచర్ల కూడా రైతు భరోసా కింద ఆర్థిక సహాయం ఇవ్వగా ప్రజా ప్రభుత్వంలో మాత్రం సాగుచేసిన భూమికే రైతు భరోసా అనే నినాదంతో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత నేరుగా రైతు ఖాతాలో నగదు జమ చేయబోతుందని తెలిపారు. 9 సంవత్సరాల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో సంక్షేమ ఫలాలు అందుకునే విషయంలో రేషన్ కార్డు లేక చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని వాటిని దృష్టిలో ఉంచుకొని నూతన రేషన్ కార్డులు త్వరలోనే అందించబోతుంది ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు
భూమి లేనటువంటి రైతు కూలీలకు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు సంవత్సరానికి 12 వేల రూపాయల హార్దిక సాయాన్ని కూడా ఇప్పటికే కొన్ని చోట్ల అందించినప్పటికీ పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అందించబోతుందని అన్నారు ప్రజా ప్రభుత్వం సన్నవడ్లు పండిస్తే ప్రతి క్వింటాకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న మాట ప్రకారం రైతులలో నమ్మకం కలిగి ఊహించిన దాని కంటే రెట్టింపుగా రాష్ట్రవ్యాప్తంగా సన్నవ డ్లు పండించిన రైతులకు ప్రతి క్వింటాకు అసలు ధరతో పాటు 500 రూపాయల బోనస్ రైతు ఖాతాలో గతంలో ఎన్నడు లేని విధంగా 24 గంటల లోపే రైతు ఖాతాలో జమ చేసింది రైతు ప్రభుత్వం అని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆర్గారంటీలు అమల్లోకి వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణ చేయడం మానుకోవాలని విద్య వైద్యము సంక్షేమ ఫలాలు అందించే విషయాలలో సలహాలు సూచన ఇచ్చినట్లయితే మరింతగా ప్రజా ప్రభుత్వంలో అమలు చేయడానికి రాష్ట్రఅభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని అని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి తో పాటు మాజీ మండల అధ్యక్షులు సుఖినే సంతాజి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి) మాజీ మండలయూత్ అధ్యక్షులు హింగే శ్రీకాంత్ మాజీ సర్పంచి గొడిశాల యాదగిరి గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ గోడిశాల రాజయ్య పాక రమేష్ బోల్లెపోగు రమేష్ స్వామి జగన్ సారయ్య యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు అంబాల స్వామిఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఏల్తూరి రత్నాకర్ అంబాల రమేష్ స అధ్యక్షులు రవీందర్, సంపత్, రమేష్ రాజేందర్, ప్రభాకర్ రామ్ సింగ్ యూత్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు