మేడిపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
విద్యార్థుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఇబ్రహీంపట్నం మేడిపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు) :
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టల్లో, గురుకులాలు, మైనారిటీ స్కూల్స్ ,కాలేజీలలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రూపొందించిన కామన్ డైట్ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో గల తెలంగాణ మైనారిటీ ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ అండ్ కాలేజ్ లో కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
- ప్రతి హాస్టల్లో ఒకే రకమైన భోజనం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
- గతంలో ఉన్న డైట్ చార్జీలు 40 శాతం ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిందన్నారు.
- పాఠశాలలో చదివే విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుదన్నారు.విద్యార్థిని విద్యార్థులు చిన్నతనంలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటి సాధనకు నిరంతరం కష్టపడాలని సూచించారు.
- కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అందరూ తమ లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మైనారిటీ రెసిడెన్షియల్ పరిసరాలను, కిచెన్, క్లాస్ రూమ్స్, వాటర్ ప్లాంట్, వాష్ రూమ్స్ ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాఠశాలలోని విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ గారు భోజనం చేశారు.
చీఫ్ మినిస్టర్ కప్ -2024 వివిధ ఆటల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మోహన్, సి.ఐ నిరంజన్ రెడ్డి , ఎస్.ఐ అనిల్ మరియు ఉపాధ్యాయలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.