సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా. -ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి.
సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా.
-ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 05:
సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని,వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి,శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ 2025 క్యాలెండర్లను,డైరీలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు.
సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పురుష వృద్ధులకు ఆంద్రప్రదేశ్ వలె తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో 50 శాతం రాయితీని తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని,సీనియర్ సిటీజేన్స్ కు ప్రత్యేకంగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేయాలని,తల్లిదండ్రుల,వృద్ధుల పోషణ,సంరక్షణ చట్టంలో 2019 లో కేంద్రం చేసిన సవరణలను పార్లమెంట్ లో ఆమోదించడానికి ,రైలు ఛార్జీల్లో సీనియర్ సిటీజేన్స్ కు అపి వేసిన రాయితీని పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని,హైదరాబాద్ లో,అన్ని జిల్లా,డివిజన్ కేంద్రాల్లో సీనియర్ సిటీజేన్స్ కార్యక్రమాల నిర్వహణ కోసం భవనాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి,ప్రభుత్వ నిధుల తో నిర్మించాలని,వృద్ధులకు అన్ని ప్రభుత్వ,ప్రభుత్వ సహాయం పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్సలు అందించాలని,వృద్దాశ్రమాలు లేని జిల్లాల్లో ప్రభుత్వం తరపున వృద్దాశ్రమాలు ఏర్పాటు చేయాలనే తదితర సమస్యల పరిష్కారం కోసం సాయం చేయాలని ఎమ్మెల్సీ కి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,నాయకులు దిండిగాల విఠల్, ఎం.డి.ఇక్బాల్,సయ్యద్ యూసుఫ్,నారాయణ,యాకూబ్ హుస్సేన్,ఎం.డి.జాఫర్, బొబ్బటి కరుణ,తదితరులు పాల్గొన్నారు.