గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
మంత్రి బండి సంజయ్ ఆరా
కరీంనగర్ జనవరి 07 :
కరీంనగర్ పట్టణం లోని శర్మనగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు రాత్రి కాలీఫ్లవర్, సాంబార్ తో భోజనం చేసి, స్టడీ అవర్స్ ముగించుకుని వారి వారి గదుల్లోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు. ఇదే సమయంలో కడుపు నొప్పి రావడం, వాంతులు కావడంతో ఇబ్బంది పడ్డారు.
తెల్లవారుజామున విరేచనాలు కావడంతో గమనించిన సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏమి లేదని డాక్టర్లు తెలిపారు.
మంత్రి బండి సంజయ్ ఆరా
కరీంనగర్ లోని శర్మనగర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు.
ఢిల్లీ నుండి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కేంద్ర మంత్రి సంజయ్.ఫోన్ చేసిన వివరాలు కనుక్కున్నారు.
కూర తినడంవల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ మంత్రికి వివరించారు.
ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ తెలిపారు.గురుకులాలు, హాస్టళ్లలో భోజనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,శుభ్రత, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.