రైల్వే స్టేషన్ వరకు డబల్ రోడ్డు వేయాలని కోరుతూ హుస్నాబాద్, అంబారిపేట గ్రామస్తుల రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) :
పట్టణంలో నిజామాబాద్ రోడ్డులోని స్వప్న దాబా నుండి రైల్వే స్టేషన్ వరకు డబల్ రోడ్డు వేయాలని కోరుతూ హుస్నాబాద్ అంబారిపేట గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... గత ఎన్ని సంవత్సరాల క్రితం డబల్ రోడ్డు వేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా డబుల్ రోడ్డు వేయకపోవడంతో ధర్నా చేపట్టామని రోడ్డు చిన్నగా ఉండడంతో, గ్రామస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందిగా మారిందని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
రైల్వే స్టేషన్ ఉండడం వల్ల గూడ్స్ రైలు వచ్చినప్పుడు అధికంగా భారీ వాహనాలు రావడం ఎదురెదురుగా వాహనాలు రావడంతో రోడ్డు సరిపోక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే చొరవ చూపి ఈ రహదారిని డబుల్ రోడ్డు చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారడంతో టౌన్ ఎస్సై కిరణ్ అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న గ్రామస్తులను నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.