అల్లు అర్జున్‌ కేసులో సినిమా ట్విస్ట్.. జైలుకు వెళ్లిన మరుక్షణమే బెయిల్ 

On
అల్లు అర్జున్‌ కేసులో సినిమా ట్విస్ట్.. జైలుకు వెళ్లిన మరుక్షణమే బెయిల్ 

అల్లు అర్జున్‌ కేసులో సినిమా ట్విస్ట్.. జైలుకు వెళ్లిన మరుక్షణమే బెయిల్ 
హైదరాబాద్ డిసెంబర్ 13:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు.. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

సినీ నటుడు అల్లు అర్జున్కు (Allu Arjun) 3 (Telangana Highcourt) ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ఏ11గా పేర్కొన్న పోలీసులు.. మధ్యాహ్నం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. క్వాస్ పిటిషన్పై విచారణ అత్యవసరం కాదని.. సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టును కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

"

Tags