సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్  చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు

On
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్  చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ 
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు 

హైదరాబాద్ డిసెంబర్ 13:

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను  చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్లో తొక్కిసలాట  జరిగిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ తో పాటు తండ్రి అల్లు అరవింద్, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు.

తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిపై ఇదివరకే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 'సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేశన్ లో యాక్టివ్ పాల్గొనలేకపోయాం అని ట్వీట్ చేశారు

మేము సినిమా తీసేదే జనాలు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయాలి అని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నానీ తెలిపారు. 

అయినా సంఘటన తీవ్రత దృష్ట్యా ధియేటర్ యజమానులు ఒకరిని ఇదివరకే అరెస్ట్ చేశారు. 

Tags