నా భార్య మృతికి అల్లు అర్జున్ కు సంబందం లేదు - మృతి చెందిన రేవతి భర్త 

On
నా భార్య మృతికి అల్లు అర్జున్ కు సంబందం లేదు - మృతి చెందిన రేవతి భర్త 

నా భార్య మృతికి అల్లు అర్జున్ కు సంబందం లేదు - మృతి చెందిన రేవతి భర్త 

హైదారాబాద్ డిసెంబర్ 13:

హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బన్నీ అరెస్ట్ పై సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త స్పందించాడు. ఈ ఘటనకు అల్లు అర్జున్కు సంబంధం లేదు. 'అల్లు అర్జున్ అరెస్టయిన విషయం టీవీల్లో చూసి తెలుసుకున్నాను. నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు. నాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సినిమా చూస్తానంటేనే నా భార్య, కొడుకును థియేటర్కి తీసుకెళ్లాను. అందులో అల్లు అర్జున్ తప్పేమి లేదు. అవసరం అయితే కేసును ఉపసంహరించుకుంటాను' అని రేవతి భర్త ప్రకటించాడు.

Tags