కుంగ్-పూ నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. -ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
కుంగ్-పూ నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది
-ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
ధర్మపురి జనవరి 05 :
కుంగ్-పూ నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతోపాటు,ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ఆదివారం ధర్మపురి పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్ గార్డెన్స్ లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్ -పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన 150 విద్యార్థులకు బెల్ట్ లు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు,ఆత్మరక్షణ కోసం ప్రతిఒక్కరు మార్షల్ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.చిన్నతనం నుండే కుంగ్ - పూ లో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు.
ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్వార్డ్ కుంగ్-పూ అకాడమీ ఫౌండర్ రాజమల్లు,ప్రెసిడెంట్ రాజేందర్,జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్,ఆర్గనైజర్ చంద్రయ్య,లింగంపల్లి రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్,ఉపాధ్యక్షుడు వేముల రాజేష్,కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల లక్ష్మణ్,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.