రాపర్తి విజయలక్ష్మికి రాష్ట్రస్థాయి సావిత్రిబాయి పూలే ప్రతిభా పురస్కార ప్రధానం
రాపర్తి విజయలక్ష్మికి రాష్ట్రస్థాయి సావిత్రిబాయి పూలే ప్రతిభా పురస్కార ప్రధానం
ధర్మపురి జనవరి 04:
ధర్మపురి పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు రాపర్తి విజయలక్ష్మిగారికీ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి నందు సావిత్రిబాయి పూలే అవార్డు ప్రధానం చేశారు.
ధర్మపురి పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు రాపర్తి విజయలక్ష్మి ని విద్యా రంగంలో, సామాజిక రంగంలో వారు చేసిన సేవలకు గాను సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి మహిళ ప్రతిభ పురస్కారం అవార్డుతో సత్కరించారు.
బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బి. మని మంజరి ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖులను అవార్డులతో సత్కరించారు,
అవార్డు ప్రధానం చేసిన సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.