గురుకుల పాఠశాలలో డైట్ గైడ్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 14 ( ప్రజా మంటలు )
రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కొత్త డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొనీ,పాఠశాలను, వంటగదినీ పరిశీలించి,హాస్టల్ రోజువారీ డైట్ గైడ్ ను ఆవిష్కరించి,క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమోంటో లు అందజేసి,విద్యార్థులు,పేరెంట్స్ తో కలిసి బొజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...
- గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన గురుకులాలు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ,నాణ్యమైన వసతి సదుపాయాలు కల్పించాలని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
- కానీ ఏటా తరగతులు పెరగడం, విద్యార్థుల సంఖ్య పెరగడం,వసతి సౌకర్యాలు,సొంత భవనాలు లేక పోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది గా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యార్థులకు నాణ్యమైన వసతి, సౌకర్యాలు బొజనం కల్పించాలని ఉద్దేశం తో 100 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయగా చల్ గల్ లో ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.
- విద్యార్థులకు నాణ్యమైన బొజనం అందించాలని 40 శాతం డైట్ చార్జీలు పెంచిన ముఖ్యమంత్రి కి విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
- ఎంపి నీ కోరగానే జిల్లా కి నవదోయ పాఠశాల కూడా మంజూరు అయింది అని గుర్తు చేశారు.
- కాస్మొటిక్ చార్జీలు 75 నుండి 275 పెంచిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.
- విద్యార్థులకు విద్య తోపాటు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ముఖ్యం అన్నారు.
- 8 లక్షల మంది పిల్లలకు 480 కోట్ల ను కేటాయించారు.
- మరికొన్ని సమస్యలు ఉన్నాయని దృష్టికి వచ్చిందని పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి,స్పెషల్ ఆఫీసర్ డా.నరేష్, ప్రిన్సిపాల్ చైతన్య,మాజీ సర్పంచ్ లు చెరుకుజాన్,గంగన్న,నాయకులు నక్క ఇంద్రయ్య,నక్కల రవీందర్ రెడ్డి,ఏలేటి రాజీ రెడ్డి,సత్తి రెడ్డి, పురీపాటి రాజీ రెడ్డి,చంద్ర రెడ్డి,మాజీ సర్పంచ్ బోనగిరినారాయణ,సుధాకర్ ,బాపు రెడ్డి, ప్రభాత్ సింగ్ ఠాగూర్,వంశి,యం ఏ అరిఫ్,రాజేష్,నాయకులు,విద్యార్థుల తల్లి దండ్రులు,తదితరులు పాల్గొన్నారు.