సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సతీమణి కాంత కుమారి.
On
సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సతీమణి కాంత కుమారి.
గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి శ్రీమతి కాంతకుమారి_ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ సతీమణి కాంత కుమారి మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అదేవిధంగా ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, బహుమతులను కాంత కుమారి అందజేసారు.
Tags