ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్/ సిద్దిపేట జనవరి 03:
అక్కన్నపేట మండల ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామగ్రామాన ప్రతి ఇంటింటికీ అవగాహన కల్పించాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేసే వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పై దృష్టి సారించాలని,స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా కాంగ్రెస్ జెండా ఎగురాలి. నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
గౌరవెల్లి,గండిపల్లి కాలువలు పూర్తిచేసి వ్యవసాయానికి సాగు నీరు అందిస్తామని,హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతామని, విద్యా,వైద్యం,సాగునీటికి నా ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని నేతలంతా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండలని రిజర్వేషన్లు ఏం వచ్చిన అందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురాలని పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నేతలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, ఆరోగ్య శ్రీ 5-10 లక్షలకు చేశామన్నారు. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. గురుకులాల్లో డైట్ చార్జీలు పెంచిందని, సన్న వడ్ల కి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. మనం ఒక ఏడాదిలోనే ఇన్ని చేశామని మనం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలన్నారు.
కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి,సింగిల్ విండో చైర్మన్ శివయ్య,అక్కన్నపేట మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు..