ఏపీ సివిల్ సప్లై అవకతవకలపై కేంద్రమంత్రికి వివరించిన ఎఫ్.సి.ఐ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
గుంతకల్ డిసెంబర్ 15 (ప్రజా మంటలు) :
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (FCI) ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని కలిసిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మరియు బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వనగొంది విజయలక్ష్మి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కేంద్ర మంత్రులు ప్రహల్లాద్ జోషి ని కలిసి గుంతకల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మరియు గతంలో ఏపీ సివిల్ సప్లై లో జరిగినటువంటి అవకతవకల గురించి కేంద్రమంత్రి వర్యులు ప్రహల్లాద్ జోషికి వివరించడం జరిగింది.
- గుంతకల్ ఎఫ్సీఐ గోల్డెన్ లో గత 18 నెలల నుండి సుమారుగా మూడున్నర సంవత్సరాల కిందటి పంట నిలువ ఉంచినారు.
- 25 మెట్రిక్ టన్నుల పంట బియ్యపు ధాన్యాల్ని నిలువ ఉంచినందున దానిలో ఎక్కువ శాతం డ్యామేజ్ తర్వాత దానిలో ఉండే నాణ్యత తగ్గుతూ వస్తున్నాయి గనుక దీనిపైన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 25 వేల మెట్రో టన్ బియ్యపు నిలువల్ని వినియోగించుకోవడానికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుతూ మరియు
- గత ప్రభుత్వం లో కేంద్ర ప్రభుత్వ ఎఫ్సిఐ గోడం లో వినియోగించుకోకుండా ప్రైవేటు గోడౌన్లను వినియోగించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా గండి కొట్టడం జరిగిందన్నారు.
- కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ గోడౌన్ లో ఉండే దగ్గర ప్రైవేటు గోదాన్లు ఉండరాదు అనే జీవో ఉన్నా కూడా ప్రైవేట్ గోడౌన్లు నడుపుతున్నారు..
- ఇది కాకుండా కొన్ని కర్ణాటక సరిహద్దు ఉన్నచోట కొన్ని అక్రమాలు కూడా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రైవేట్ గోడౌన్లు...
పై విషయాల పైన చర్చించి ఆదేశం ఇవ్వాల్సిందిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రివర్యులు ప్రహల్లా జోషి కి కోరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ వనగుంది విజయలక్ష్మి.