ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్
బైక్ ఆపకుండా వెళ్లినందుకు ఇంటికి వచ్చి కొట్టిన ఎస్సై
ఎస్సైపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేసిన రాజేందర్
గొల్లపల్లి /కొడిమ్యాల) జనవరి 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన రాచకొండ రాజేందర్ కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ పై సోమవారం జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం బస్టాండు నుండి ఇంటికి బైక్ ఆపకుండా వెళ్లినందుకు ఎస్సై ఇంటికి వచ్చిలాటి తో చితక బాధాడని బాధితుడు కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడుతూ, కొడిమ్యాల ఎస్‌ఐ సందీప్‌కుమార్,మరియు కానిస్టేబుల్ రాకేష్ నా చెవిపై కొట్టారని, కుడి చెవి వినిపించడం లేదని. డాక్టర్లు కర్ణం బేరి దెబ్బతిన్నదని అన్నారని, హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
నా తల్లి తండ్రి కుటుంబ సభ్యులు మరియు నా భార్య ఇద్దరు పిల్లలు ఎస్ ఐ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కి వేడుకున్న కనికరం చూపకుండా లాఠీ తో లాటి విరిగేదాకా కొట్టాడని బాధితుడు తెలిపాడు.ఎస్ ఐ చెవ్వు పై కొట్టిన దెబ్బలకు కర్ణాబేరి చిన్నగా పలిగిందని, డాక్టరులు సర్జరీ చేయవలసి వస్తుందని తెలిపారని బాధితుడు తెలిపాడు