టి.పి.టి.ఎఫ్ 2025 వాల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు) :
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ 2025 సంవత్సరపు వాల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.....
- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో పోరాటం చేసే సంఘమని కొనియాడారు.
- 317 జీవో బాధితులందరికీ తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుని చెల్లించుటకు సమాయత్తమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సీనియర్ నాయకులు సూద రాజేందర్,రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు గొడుగు రఘుపతి యాదవ్,జిల్లా అధ్యక్షులు కొక్కుల రామచంద్రం,ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోవర్ధన్, జిల్లా నాయకులు కూరగాయల చంద్రశేఖర్, రాచమల్ల మహేష్, వేముల సుధాకర్, గండి రాజయ్య, ఫక్రుద్దీన్, తొగిటి సుధాకర్, మనోహర్, రాజ మల్లయ్య, గొల్లపల్లి సత్యనారాయణ, విలాసాగరం సంతోష్ కుమార్, గజ్జల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.