రెసిడెన్షియల్ , నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒకే డైట్, ఒకే మెనూ అమలు చేయాలి. - స్టేట్ టీచర్స్ యూనియన్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు) :
రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడుతున్న అన్ని రకాల రెసిడెన్షియల్ , నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలల్లో సైతం డైట్ చార్జీలు , మెనూ ఓకేలా అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టియు) జగిత్యాల జిల్లా శాఖ ప్రభుత్వాన్ని కోరింది.
స్థానిక విద్యానగర్ లోని ఎస్టీయు భవన్లో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ మాట్లాడుతూ....
- విద్యార్థులoదర్ని రాష్ట్ర ప్రభుత్వం తారతమ్యాలు లేకుండా తన బిడ్డల్లా ఒకేలా పరిగణించాలని,
- ప్రభుత్వం తన ఆధీనంలో విద్యార్థి ఎక్కడ చదివినా తన విద్యార్థిగానే భావించాలన్నారు.
- సాంఘిక సంక్షేమ , మైనారిటీ, మోడల్, కేజీబీవీ తదితర హాస్టల్లో ఒకలా , వీటికి భిన్నంగా నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో మరోలా వేరువేరుగా డైట్ చార్జీలు, మెనూ పాటించడం వల్ల విద్యార్థుల మధ్య అనేక అంతరాలు ఏర్పడి విద్యా ప్రమాణాల మీద ప్రభావం చూపుతున్నాయన్నారు.
- ప్రభుత్వం కేవలం రెసిడెన్షియల్ పాఠశాలలనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూడా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి బండి శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అద్యక్షులు మేకల ప్రవీణ్, జిల్లా నాయకులు మురళి, తిరుపతి చారి, రాజేశం నంద్యా నాయక్ , వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండెల నరేష్,విద్యామని కృష్ణ,దశరథ్ రెడ్డి, రాజేష్, గంగాధర్ , తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.