తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ను కలిసిన తెలంగాణ. లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఫోరం సభ్యులు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ జనవరి 4 (ప్రజా మంటలు) :
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తో తెలంగాణ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఫోరం (టి ఎల్ టి ఎఫ్)రాష్ట్ర అధ్యక్షులు మాడిశెట్టి తిరుపతి రావు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మాడిశెట్టి తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో పాటు శాశ్వత ఉద్యోగులుగా ఉన్నతీకరించడం,సమాన పనికి సమాన వేతనం నెలకు 80,000 జీతం ఇచ్చే విధంగా ప్రత్యేక జీవోను విడుదల చేయవలసినదిగా కోరారు.
పాఠశాల కళాశాల సమయాల కుదింపు,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ కు ఓటు హక్కు కచ్చితంగా అమలు, 12 నెలల జీతభత్యాలు, అపాయింట్మెంట్ ఆర్డర్ ను సంబంధిత డీఈవో, ఆర్ ఐ ఓ ల నుండి అందించే విధంగా చర్యలు, ఈ స్ ఐ,పిఎఫ్, హెల్త్ కార్డ, భాషా ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు నెలకు 80 వేలకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో ఆకునూరి మురళి మాట్లాడుతూ....
- ప్రైవేట్ టీచర్ల ,లెక్చరర్ల సమస్యల గురించి లేఖ లో (లెటర్ ప్యాడ్) చేర్చిన20 అంశాలను తప్పకుండా పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
సుమారుగా మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రైవేటు టీచర్ల, లెక్చరర్ల బాధలను విన్నటువంటి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ,ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు, మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, మాడిశెట్టి తిరుపతి అన్నారు.
ఇట్టి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనాల ప్రకాష్, మధు,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విశ్వంభర శర్మ, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సరస్వతి, రాష్ట్ర అదనపు కార్యదర్శి సైదులు, పాల్గొనడం జరిగింది.