మైనర్ బాలికల పై అత్యాచారం 3 కేసులలో నిందితునికి ప్రతి కేసులో 20 సంవత్సరములు మొత్తం 60 సం. ల కఠిన కారాగార శిక్ష
మైనర్ బాలికల పై అత్యాచారం 3 కేసులలో నిందితునికి ప్రతి కేసులో 20 సంవత్సరములు మొత్తం 60 సం. ల కఠిన కారాగార శిక్ష
ముగ్గురు బాధిత బాలికలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు పరిహారం
గొల్లపల్లి డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన ముగ్గురు మైనర్ బాలికల పై నిందితుడు శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.
డిఎస్పి లు వెంకటస్వామి,రఘు చంధర్ కేసును విచారించి, జిల్లా ఎస్పి ఆదేశాలమేరకు విచారణను వేగవంతం చేసిన పోలీసులు Fast track spl Court కి ఆధారాలు సమర్పించారు.
పిపి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి నీలిమ మంగళవారం నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి ఒక్కొక్క కేసుకు 20 సంవత్సరాల చొప్పున మొత్తం 60 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష కారగార శిక్ష మరియు 1000/- జరిమాన, బాధిత బాలికలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ, సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ వేగవంతగా జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.
పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పీపీ గా రామకృష్ణ రావు ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా డీఎస్పీలు రఘు చంధర్ , వెంకటస్వామి ,ఎస్.ఐలు సతీష్, నరేష్ , కోర్ట్ కానిస్టేబుల్స్ శ్రీధర్, లైజనింగ్ కానిస్టేబుల్స్ కిరణ్ లు నిందితునికి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించారు పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ అభినందించారు.