ప్రజలు పోలీసులకు సహకరిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలె - డీఎస్పీ రఘుచందర్.
On
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలె - డీఎస్పీ రఘుచందర్.
జగిత్యాల డిసెంబర్ 31:
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో సీఐ సూరం వేణు గోపాల్ ఆధ్వర్యం లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ముందస్తుగా ముమ్మర తనిఖీలను చేపట్టారు.
పట్టణం లో డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలను పరిశీలించారు.వీలైనంతవరకు ప్రజలు తమ ఇండ్ల లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని సూచించారు.రోడ్ల పైకి డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవింగ్ వంటివి చేయకూడదని హెచ్చరించారు.ప్రశాంతమైన వాతావరణం లో న్యూ ఇయర్ వేడుకలు జరిగేందుకు వెహికల్ చెకింగ్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు. జగిత్యాల ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags