సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా ఉంటాం - కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి
సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా ఉంటాం - కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డితో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రతినిధుల భేటీ
హైదరాబాద్ జనవరి 03:
అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్ర ఉక్కు, గనుల శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
సమగ్ర శిక్ష కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 60 శాతం నిధులను ఇస్తుండగా, మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి , వర్కింగ్ ప్రెసిడెంట్ వీ. అనిల్ చారీ ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని, కానీ చాలీ చాలని వేతనాలతో సతమతమవుతున్నామని వారు పేర్కొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.