కారుణ్య నియామకాల కోసం ప్రజావాణికి భారీగా తరలి వచ్చిన వీ.ఆర్.ఏ. వారసులు
త్వరలో న్యాయం చేస్తామన్న చిన్నారెడ్డి, దివ్య
కారుణ్య నియామకాల కోసం ప్రజావాణికి భారీగా తరలి వచ్చిన వీ.ఆర్.ఏ. వారసులు
హైదరాబాద్ జనవరి 03:
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( వీ.ఆర్.ఏ. ) వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ వందలాది మంది ప్రజావాణి కార్యక్రమానికి తరలి వచ్చారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చిన వీఆర్ఏ వారసులు తమ సమస్యలను ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య లకు విన్నవించారు.
ప్రభుత్వ ఉత్తర్వులు 81 అండ్ 85 లలో పొందుపరిచిన విధంగా వీఆర్ఏ వారసులు 3,797 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు.
ఈ విషయంపై చిన్నారెడ్డి దివ్య మాట్లాడుతూ రెవెన్యూ మంత్రి రెవిన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు.
## 2008 డిఎస్సి లో ఎంపికైన తమకు పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతూ అభ్యర్థులు ప్రజావాణికి తరలివచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వు 9 మేరకు వెంటనే తమకు ఎస్ జి టి టీచర్ గా నియామక పత్రాలు ఇవ్వాలని కోరగా, ప్రభుత్వంతో, విద్యాశాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే చర్యలు తీసుకుంటామని చిన్నారెడ్డి, దివ్య వారికి తెలిపారు.
ప్రజావాణి లో 359 అర్జీలు
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 359 అర్జీలు అందాయి.
ప్రజావాణి ఇన్చార్జి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు 103, విద్యుత్ శాఖకు 85, రియల్ శాఖకు 62, ఇతర శాఖలకు సంబంధించిన 109 దరఖాస్తులు అందాయి.