రైతుల ఇబ్బందుల నివారణకు ఒక టిఎంసి నీటికి గోదావరిలోకి విడుదల చేయాలి మంత్రి ఉత్తంకు అడ్లూరి వినతి
రైతుల ఇబ్బందుల నివారణకు ఒక టిఎంసి నీటికి గోదావరిలోకి విడుదల చేయాలి మంత్రి ఉత్తంకు అడ్లూరి వినతి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
గోదావరి నదీ జలాలను వ్యవసాయానికి వినియోగించేందుకు నిర్దేశించ బడిన ఎత్తి పోతల పథకాల పైన ఆధారపడి సుమారు 25 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగు అవుతుండగా, అనుకొని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేక సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో కలిసి గురువారం రోజున గోదావరిని మరియు లిఫ్ట్‌లను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తం కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి గోదావరిలో ఒక టిఎంసి నీటికి విడుదల చేయాలనీ కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ ..
గోదావరి నది పైన సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం కారణంగా ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల ప్రాంతాలకు గోదావరి నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గేట్ల నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల తమ ప్రాంతంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నీరు అందక 16 గ్రామాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల భూమినీ సాగు చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై నష్టపోవడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో ఇట్టి పరిస్థితి స్వయంగా సమీక్షించి ఒక టిఎంసి నీటికి గోదావరి నదిలో విడుదల చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వండం జరిగింది. మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్ కుమార్ తెలిపారు.