జమాతే ఇస్లాం హింద్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 3 (ప్రజా మంటలు) :
పట్టణ జమాతే ఇస్లామి ఇ హింద్ కార్యాలయం లో జమాతే ఇస్లామి ఇ హింద్ ఆద్వర్యం లో 9వ ఉచిత కుట్టు మిషన్ లో శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అనంతరం 2025 క్యాలండర్,డైరీ ఆవిష్కరణ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ....
మహిళలకు,గృహిణీలకు,యువతులకు ఉచితంగా కుట్టు మెషిన్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్ధిక పురోగతికి దోహదం చేస్తాయని అన్నారు. జమతే ఇస్లామి హింద్ విభాగం వారు చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు.
జగిత్యాల పట్టణం లో ముస్లిం మైనార్టీ మహిళల కు కుట్టు మిషన్ లు పంపిణీ చేయటం జరిగింది అని గుర్తు చేశారు.
జగిత్యాల డబల్ బెడ్ రూం ఇండ్ల లో మైనార్టీ మహిళల కు ఇండ్లను మంజూరు చేశామని అన్నారు.
కుల మత వర్గ జాతి భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తాను అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,ఇమాధ్ ఉద్దీన్,షోయబ్ ఉల్ హక్,అహమ్మద్,జావేద్, సయ్యద్ గౌస్,ఇర్షాద్,మహేష్,తస్కీమ్,మహిళలు,మైనార్టీనాయకులు,తదితరులు పాల్గొన్నారు.