40 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరందించకపోవడం శోచనీయం. - జెడ్పి తొలి చైర్పర్సన్ దావ వసంత.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 3 (ప్రజా మంటలు) :
40 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలకు రైతులకు సాగునీరు అందించాలని ఆలోచన లేకపోవడం శోచనీయమనీ మాజీ మంత్రి కొప్పుల, జెడ్పి తొలి చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
- ఉమ్మడి సారంగాపూర్ మండలం లోని రోళ్ళవాగు ప్రాజెక్టు ఆధునీకరించడానికి 2016 లో అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు , ఎంపీ కవిత ,జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది..
- రోళ్ళవాగు ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా సారంగాపూర్, బీర్ పూర్, మరియు ధర్మపురి లో దాదాపు 17 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతాయన్నారు.
- గత ప్రభుత్వాలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు ముందు దాదాపు 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని ఏనాడూ ఆలోచ లేదు..
ఈ ప్రాంతం నుండి పలు మార్లు ఎమ్మెల్యే గా, మంత్రులు గా ప్రాతినిధ్యం వహించారు..
ఈ రోళ్ళవాగు ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, ఏనాడూ ఆలోచించలేదు...
తెలంగాణ రాష్ట్రం వచ్చాక తర్వాతనే గోదావరి ఒడ్డు పొడవునా అనేక లిఫ్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది..
జగిత్యాల నియోజకవర్గంలోని కొమ్ము నూరు, మంగెల, బోర్నపల్లి, ధర్మపురి నియోజకవర్గం లో ఆరెపెల్లి నుండి మొదలుకొని వెల్గటూర్ మండలం ముత్తునూరు వరకు 14 లిఫ్టులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ లిఫ్టులు మరియు రోళ్ళవాగు ప్రాజెక్టు ద్వారా దాదాపు 1 లక్ష ఎకరాలకు నీరు అందించే ఏర్పాటు జరిగింది..
వంద కోట్ల రూపాయల వ్యయం తో ఈ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేసిన గొప్ప కార్యక్రమం..
2016 లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు..
పావు TMC నుండి 1 TMC వరకు దీని సామర్థ్యాన్ని పెంచడం జరిగింది...
ఇలా పెంచడం ద్వారా దాదాపు 17 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించడం జరిగింది..!
2016 లో ప్రాజెక్టు వ్యయం 60 కోట్ల నుండి 136 (RE) కోట్లకు పెరిగింది...! అలాగే ఫౌండేషన్ డెప్త్ కూడ పెరిగింది..
GST - 5% నుండి 18% పెరిగింది..
ల్యాండ్ అక్యువేషన్ ధర కూడా పెరిగింది..!
- రెవెన్యూ ల్యాండ్ - 279 ఎకరాలు
- ఫారెస్ట్ ల్యాండ్ - 850 ఎకరాలు
అప్పుడు అనుమతుల కోసం పంపడం జరిగింది, కానీ ఇప్పటికీ పూర్తి చేయలేదు..?
గేట్లు పెట్టలేదు రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో తమాషా చూస్తున్నారు..
గోదావరి నది మీద జగిత్యాల మరియు ధరంపూర్ నియోజకవర్గాల్లో దాదాపు 20 వేల నుండి లిఫ్టులు ఉన్నాయి..
ఒక్కొక్క లిఫ్ట్ 2 వేల నుండి 3 వేల వరకు గోదావరి లిఫ్ట్ ద్వారా రైతుల పొలాలకు నీరు అందిస్తున్నాయి..
గోదావరి నది ఒడ్డున ఉన్న రైతులు వేల సంఖ్యలో పంపు మోటర్లు పెట్టుకుని అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు..
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరిలో నీళ్లు వదలండి, రైతులు బతికి పోతారు.
రోళ్లవాగు ప్రాజెక్టు పనులు పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయండి కానీ అడ్డమైన విమర్శలు చేయటం వల్ల రైతుల పొలాల్లో నీళ్ళు రావు, మీరు మంచి వారై పోరు...
ఈ కార్యక్రమంలో డి.సి.యం.యస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సాగి సత్యం రావు, pacs చైర్మన్ మాధవ రావు, సారంగాపూర్ బి.ఆర్.యస్ మండల అధ్యక్షుడు తెలు రాజు, పడిగేలా గంగా రెడ్డి, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, మాజీ జిల్లా sc, st మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎండబెట్ల ప్రసాద్, ఆనంతుల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.