మల్లనపేటలో  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి జాతర ముగింపు

On
మల్లనపేటలో  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి జాతర ముగింపు

మల్లనపేటలో  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి జాతర ముగింపు 

జిల్లా ఎస్పికి, అధికారులకు సన్మానం

గొల్లపల్లి డిసెంబర్ 31 (ప్రజా మంటలు):

గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లనపేటలో  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి  ప్రశాంతంగా జాతర  సహకరించినందుకు మల్లన్న పేట జాతర ఆలయ  కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో మర్యాద పూర్వకముగా కలిసి శాలువతో ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ,డిసెంబర్ 6 తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు జరిగిన జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే దర్శనం చేసుకోవడం జరిగిందని, ఈ  యొక్క జాతర  ప్రశాంత వాతావరణంలో  సహకరించిన ప్రజలకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.జాతరకు సంబంధించి ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సి.ఐ రామ్ నరసింహారెడ్డి , ఎస్.ఐ సతీష్ ఆద్వర్యంలో జిల్లాలో ఉన్న ఇతర పోలీస్ అధికారులు,ఎస్.ఐ లు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే జాతరను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ  అభినందించారు.

ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ ప్రశాంత వాతావరణంలో పండగల ను నిర్వహించడానికి పోలీస్ శాఖ తరపున కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, ధర్మపురి  సి.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ లు సతీష్, ఉమ సాగర్, శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్, ఆలయ ఈవో విక్రమ్, ట్రస్ట్ సభ్యులు శాంతయ్య, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags