అశ్విని సొసైటీ చే విద్యార్థులకు నోటుబుక్స్ ఎగ్జామ్ ప్యాడ్ పెన్సిల్లు పంపిణి
అశ్విని సొసైటీ చే విద్యార్థులకు నోటుబుక్స్ ఎగ్జామ్ ప్యాడ్ పెన్సిల్లు పంపిణి
గొల్లపల్లి డిసెంబర్ 07 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట లోనీ
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అశ్విని సొసైటీ ఆధ్వర్యంలో 150 విద్యారులకు ఎగ్జాం ప్యాడ్లు, నోట్ బుక్కులు, పెన్సిల్స్, పెన్నులు, కంపాస్ బాక్సులు తదితర స్టేషనరీని అందించిన సొసైటీ సభ్యులు పూర్ణి రెడ్డి & కిషోర్ రెడ్డి
సమస్యపరుస్తూ సామాజిక సేవకులు డా॥ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, మల్లన్న పేట పాఠశాలకు సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యారులు బాగా చదువుకోవాలని ఉన్నతస్థానానికి చేరుకొని వీలయినంతలో పది మందికి సాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జమున, ఉపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, రాజేశం, రవీందర్, బాల చంద్రుడు, కుమారస్వామి, శరత్ చందర్,, స్రవంతి, నందయ్య తదితరులు పాల్గొన్నారు.