వెంగలపూర్ గ్రామంలోని సహకార సంఘం ఏర్పాటు చేయండి
వెంగలపూర్ గ్రామంలోని సహకార సంఘం ఏర్పాటు చేయండి
జగిత్యాల జిల్లా సహకార సహాయ అధికారి కి
వినతి పత్రం అందజేసిన మాజీ సర్పంచ్ బలభక్తుల కిషన్
గొల్లపల్లి జనవరి 03 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిషత్తు సంఘం లిమిటెడ్ ఏర్పాటు కు గ్రామంలో 1980 సంవత్సరంలో వెంగలాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ప్రభూత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి వెంగలాపూర్ సొసైటీ లోనే ఉన్నది ఇట్టి సొసైటీకి మా గ్రామ శివారులో s.no 448/ఊ విస్తీర్ణం0-07 1/2 భూమిని 1992 వ, సంవత్సరంలో కొనుగోలు చేసి సంఘం భవనం కొరకు భూమి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం పూర్తయింది సంఘ పరిధిలో వెంగలాపూర్ ,నంది పల్లె ,రాపల్లి, గంగాపూర్ యశ్వంతరావుపేట్, మల్లన్నపేట్ ,శంకర్రావుపేట ,ఇబ్రహీం నగర్ మరియు భీభరాజ్ పల్లి గ్రామాలతో కలిపి 2005 వ సంవత్సరం దాకా వెంగళపురం సంఘాన్ని గొల్లపెల్లి సొసైటీ లోనే విలీనం చేశారు .కావున మళ్లీ మా వెంగలపూర్ గ్రామంలోని సహకార సంఘం ఏర్పాటు చేస్తేనే అన్ని గ్రామాలకు అనుగుణంగా ఉంటుంది అన్ని గ్రామాలకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేయాలని పలు గ్రామా రైతులు ప్రజలు కోరుకుంటున్నారు