ప్రజావాణి ద్వారా బాధితుడికి వీల్ చైర్ ప్రదానం  - ప్రజావాణిలో 354 అర్జీల నమోదు - పాల్గొన్న చిన్నారెడ్డి, దివ్య

On
ప్రజావాణి ద్వారా బాధితుడికి వీల్ చైర్ ప్రదానం  - ప్రజావాణిలో 354 అర్జీల నమోదు - పాల్గొన్న చిన్నారెడ్డి, దివ్య

ప్రజావాణి ద్వారా బాధితుడికి వీల్ చైర్ ప్రదానం 
- ప్రజావాణిలో 354 అర్జీల నమోదు
- పాల్గొన్న చిన్నారెడ్డి, దివ్య

హైదరాబాద్ డిసెంబర్ 31:

పక్షవాతం వచ్చి కాలు, చేయి పని చేయకుండా పోయిన వ్యక్తికి ప్రజావాణి ద్వారా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి. చిన్నారెడ్డి వీల్ చైర్ ను అందజేశారు.

మంగళవారం మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లబ్ధిధారునికి చిన్నారెడ్డి వీల్ చైర్ ను అందజేశారు.

హైదరాబాద్ లోనే కాటేదాన్ టిఎంజి కాలానికి చెందిన ఎన్ శేఖర్ ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు ఏర్పడి పక్షవాతం తో కుడికాలు కుడి చేయి పంచడం మానేశాయి. తన సమస్యను విన్నవించుకునేందుకు శేఖర్ మొదటిసారిగా మంగళవారం ప్రజావాణికి వచ్చారు. శేఖర్ నడవలేని పరిస్థితిని గమనించిన చిన్నారెడ్డి ప్రజావాణి ద్వారా వీల్ చైర్ లో అందజేశారు. దీంతో శేఖర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆనంద భాష్పాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డికి, దివ్యకు శేఖర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజావాణి బాధ్యులు రాకేష్ రెడ్డి, జగన్, సాయి, సహదేవ్, శేషు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో 354 అర్జీల నమోదు

మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 354 అర్జీలు నమోదు అయ్యాయి. 

ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కొన్ని ఆర్జీలపై ఎండార్స్ మెంట్ చేసి సంబంధిత అధికారులకు పంపారు.

పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి 141 అర్జీలు, విద్యుత్ శాఖకు 71, రెవెన్యూ శాఖకు 42, ఇతర శాఖలకు సంబంధించి 100 అర్జీలు అందాయి

Tags