జగిత్యాల లో మధు యాష్కి జన్మదిన వేడుకలు.
మధు యాష్కి జన్మదిన వేడుకలు.
కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గిరి నాగభూషణం
గొల్లపల్లి డిసెంబర్ 15 ప్రజా మంటలు
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో 2వ వార్డులో జగన్ పద్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గిరి నాగభూషణం మాట్లాడుతూ, ప్రతిక్షణం ప్రజలు, రైతులు, అన్ని రకాల వర్గాల ప్రజల కోసమే పని చేశారని, మధు యాష్కి గౌడ్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.
నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ కు మధు యాష్కీ గౌడ్ ఈ జిల్లాకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. మధు యాష్కీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లత-జగన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు