గొల్లపెల్లి మండల కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
గొల్లపెల్లి మండల కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
గొల్లపల్లి డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని
మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ వద్ద రాజ్యసభ సభ్యురాలు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 78 వ జన్మదినం వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రజల అకాంక్షను నెరవేర్చడానికి ఆత్మబలిదా నాలను ఆపేందుకు, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు.
దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించి తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అన్నారు. దేశ ప్రధా ని పదవి వచ్చినా వద్దనుకొని వదిలిన మహానేత అన్నారు.
సంక్షేమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ ,వైస్ చైర్మన్ పురపాటీ రాజిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ కొక్కుల జలంధర్, ఓరగంటి తిరుపతి , చాడ సత్తయ్య , యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురంశెట్టి గౌతమ్ మాజీ సర్పంచ్ లు చిర్ర గంగాధర్ రేవెల్ల సత్యనారాయణ గౌడ్ పురం శెట్టి పద్మా వెంకటేష్ సరసాని రాజ్యలక్ష్మి -తిరుపతి రెడ్డి మాజీ ఎంపీటీసీ లంబ దనవ్వ-లక్ష్మణ్ మాజీ ఉప సర్పంచ్ కొండా వెంకటేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెరెల్ల మహేష్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు కాశ గంగాధర్ ఈర్నాల రాజేశ్వర్ రాపల్లి గంగన్న గురుజల బుచ్చిరెడ్డి దాసరి తిరుపతి చిర్ర దిలీప్ శ్రీనివాస్ రెడ్డి రాజారావు కాంగ్రెస్ నాయకులు ఓర్సు విజయ్ ఆవుల ప్రవీణ్ నల్ల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.