ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు).
ధనుర్మాసం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఉదయాత్ పూర్వము నుండే భక్తులు ఆలయానికి చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు.
వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పాశురాలు పట్టించారు.
బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కంజర్ల అనంత ఆచార్యులచే, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ అర్చకులచే ధనుర్మాస పూజలు నిర్వహించారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ఇదిలా ఉండగా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్థానిక మడలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వహస్తాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారథి శర్మ నేతృత్వంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
శివనామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ మహదాశిర్వచనం చేశారు.