రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:.. .
ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ
వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం,
నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు, సహస్రనామార్చనలు, పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం, వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం
ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున
శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.
వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం
శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో
ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి, అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.
ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు
ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.
సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు
సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు, జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం
దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై సంబంధిత పాశురం గురించి వివరించారు.