ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి.
గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు9:
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జగిత్యాల జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు అలాగే మత్తు పదార్థాలకు బానిస కావద్దని వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పారు అదేవిధంగా విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే విధంగా ఎక్కువగా శ్రమపడి వాటి ఫలితాలను సాధించి మీ తల్లిదండ్రులకు మీ ఊరికి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అలాగే రాబోయే వార్షిక పరీక్షలకు అందరూ సన్నద్ధమై ఉండాలని ఇష్టపడి కష్టపడాలని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ప్రతి నిమిషం సద్వినియోగపరుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.