ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలు
ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలు
జగిత్యాల/గొల్లపల్లి జనవరి 10 ప్రజా మంటలు
జగిత్యాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి- వర్ధంతి రోజును పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ కుమార్ అధ్యక్షతన తెలుగు శాఖ విభాగం ఆద్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఇట్టి కార్యక్రమంలో అలిశెట్టి రచనలపై తెలుగు విభాగం విద్యార్థులు సమీక్ష నిర్వహించారు ఇట్టి సమీక్షలో అలిశెట్టి ప్రభాకర్ అనేక కవితలను,జీవిత విశేషాలను విద్యార్థులు మరొకసారి గుర్తు చేసుకున్నారు.
అలిశెట్టి ప్రభాకర్ ఎంతో చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ తన యొక్క కవితలు సమాజం పై ఎంతో ప్రభావం చూపాయని కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఏ.శ్రీనివాస్ ,తెలుగు విభాగం అధ్యక్షులు సురేందర్ , పీజీ కళాశాల సమన్వయకర్త గోవర్ధన్,అధ్యాపకులు పి.రాజు,సాయి మధుకర్, కే.శ్రీనివాస్.తెలుగు విభాగం అధ్యాపకులు గణపతి,ప్రతిభ,స్వరూప రాణి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.