48 గంటల ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె.

- సెకండ్ ఏఎన్ఎం లను రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలి.

On
48 గంటల ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 19( ప్రజా మంటలు) : 

జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట గురువారం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

  • గత ఇరవై సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పలు రకాల స్కీమ్ లలో సెకండ్ ఏఎన్ఎం లుగా పని చేస్తున్నామని వీరంతా నలభై ఐదు సంవత్సరాలకు పై బడిన వారు కాబట్టి పోటీ పరీక్షలు రాసే పరిస్థితి లేనందని అన్నారు.
  • దశాబ్ది కాలంగా ఏఎన్ఎం లు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వీరి సర్వీసు క్రమబద్ధీకరణ కోసం చేసిన పోరాటాలు, సమ్మెలు దృష్టిలో ఉంచుకొని రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని అందుకుగాను మేము న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యి 48 గంటలు నిరవధిక సమ్మె 19 వ తేది గురువారం నుండి 20 వ తేది శుక్రవారం రోజు వరకు నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధమయ్యమని సెకండ్ ఏఎన్ఎం లు తెలిపారు.  

రాత పరీక్ష లేకుండా సెకండ్ ఏఎన్ఎం లను ప్రతి ఒక్కరినీ రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags