జగిత్యాలలో ఎల్.ఐ.సి. ఎ.వొ.ఐ. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు- సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాం - ఏజెంట్స్ సమస్యలపై పోరాడుతాం - జెండా ఎగుర వేసిన రాజు కుమార్
జగిత్యాలలో ఎల్.ఐ.సి. ఎ.వొ.ఐ. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు- సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాం - ఏజెంట్స్ సమస్యలపై పోరాడుతాం - జెండా ఎగుర వేసిన రాజు కుమార్
జగిత్యాల డిసెంబర్ 20:
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డులో గల భారతీయ జీవిత భీమా సంస్థ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం ఎల్.ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల శాఖ అధ్యక్షులు ఆమందు రాజు కుమార్ ఆధ్వర్యంలో సంఘం యొక్క జెండా ఎగుర వేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎల్.ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం, ఇప్పటి వరకు సాధించిన విజయాలు, చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భారతీయ జీవిత భీమా సంస్థ అభివృద్ది కోసం కృషి చేస్తామని అన్నారు.
ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి పరిష్కారాలు సాధిస్తామని తెలిపారు. ఈ మధ్య కాలంలో సంస్థ ద్వారా జరిగిన మార్పులపై పాలసీ దారులకు, ఎజెంట్ల కు తగు న్యాయం జరగాలని ఇన్సూరెన్స్ రెగ్యు లారిటీ డెవలాప్ మెంట్ ఆర్గ నైజేశన్ ఆప్ ఇండియా నిబంధనల ప్రకారం పోరాటం, ఉద్యమాలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఈ కార్య క్రమంలో ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మి కాంతం, కోశాధి కారి మహంకాళి ప్రభాకర్, చీఫ్ అడ్వైజర్ ఏనుగు గంగారెడ్డి, అడ్వయిజర్ చుక్క గంగారెడ్డి, ప్రతి నిధులు రౌతు నర్సయ్య, తాటిపెల్లి రాజిరెడ్డి, గొల్లపల్లి రాజేశం, చిలుక లక్ష్మి నారాయణ, ఏనుగు ఆనంద రెడ్డి, పుల్కం జలపతి, రాం. పూర్ శ్రీనివాస్, కాసారపు లక్ష్మి నారాయణ, జల్ద అశోక్ తదితరులు పాల్గొన్నారు.