కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి - బిక్కునూర్ SI అదృశ్యం
కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి - బిక్కునూర్ SI అదృశ్యం
కామారెడ్డి డిసెంబర్ 26:
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ అదృశ్యం కావడం, అందులో ఇద్దరి శవాలు దొరకడం జిల్లాలో సంచలనం కలిగిస్తుంది.
ఎల్లారెడ్డి చెరువు వద్ద వారి వస్తువులు కనిపించడంతో అర్ధరాత్రి వరకు గాలించారు. శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎస్సై ఫోన్ స్విచ్‌ఆఫ్ అని వస్తుండడంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు.
వీరిద్దరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మహిళ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుండి గజ ఈతగాళ్లు వెలికితీసారు.
ఎస్సై సాయికుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. చెరువు కట్ట వద్ద ఎస్సై సాయి కుమార్ పర్సనల్ కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు దొరికాయి.
ఘటనా స్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు మాత్రమే ఉండి సాయి కుమార్ ఫోన్ లేకపోవడం స్విచ్చాఫ్ వస్తుండటంతో ఎక్కడికైనా పరారయ్యారా అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.