ఆర్ఓఆర్ గా జగిత్యాల పట్నం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం గర్వకారణం.

On
ఆర్ఓఆర్ గా జగిత్యాల పట్నం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం గర్వకారణం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు) : 

రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ ఓ ఆర్ జగిత్యాల పట్టణం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం గర్వకారణం అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు

మంగళవారము జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘ అద్యక్షురాలు అడువాల జ్యోతి అధ్యక్షతన డిసెంబర్-2024 మాసము కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరిగినది.

ఇట్టి సమావేశమునకు ముఖ్య అతిథులుగా ఎం.ఎల్.ఏ డా. ఎం. సంజయ్ కుమార్ మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ (L.Bs) బి. గౌతం రెడ్డి హాజరై, కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన “NAKSHA” (National Geo Special Knowledge Land Survey of urban habitations) ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ (MORD) రాష్ట్ర ప్రభుత్వ సహకారముతో చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమము.

అర్భన్ ఆస్తులకు సంబందించిన జియోస్పేషియల్ నాలెడ్జ్ బెసేడ్ కాడాస్ట్రాల్ సర్వేను రూపొందించడానికి మరియు Record of Rights (RoR) ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రములోని (10) పట్టణములకు మంజూరి చేయగా అందులో జగిత్యాల పట్టణము పాయిలెట్ ప్రాజెక్ట్ క్రింద ఎంపిక కావడము ఎంతో గర్వకారణమని వారు తెలిపినారు.

ఇట్టి ప్రాజెక్ట్ గురించి గౌరవ కౌన్సిల్ సభ్యులకు వివరముగా తెలియచేయడము జరిగినది.

అంతే కాకుండా జగిత్యాల మునిసిపాలిటీ లో నూతనముగా నియామకము అయిన వార్డు అధికారులకు జగిత్యాల పట్టణము అభివృద్ధి విషయములో ముందు వరుసలో ఉండే విదముగా కృషి చేస్తూ చిత్త శుద్దిగా పనిచేయాలని వారికి దిశా నిర్దేశము చేయడము జరిగినది.

రాబోయే శివరాత్రి పండుగను పురస్కరించుకొని పట్టణములో గల శివాలయముల యందు భక్తుల సౌకర్యార్ధము ఏర్పాట్లు చేయుటకు రూ.11.30 లక్షలు, రంజాన్ పండుగ, షెబెఖాదర్ మరియు షబే భారత్ సందర్భముగా పట్టణములో ఈద్గా వద్ద, గ్రేవ్ యార్డుల వద్ద జంగిల్ కటింగ్, పెండల్ టెంట్స్, సౌండ్ సిస్టం, లైటింగ్ మరియు ఇతర ఏర్పాట్లు చేయుటకు గాను రూ. 14.30 లక్షలు, జగిత్యాల పట్టణములోని అంగడి బజార్ లో చేనేత విగ్రహమును ఏర్పాటు చేయుటకు రూ.6.00 లక్షలు అలాగే చింతకుంట స్మశాన వాటిక మరియు టి.ఆర్. నగర్ లోని స్మశాన వాటికలను అభివృద్ధి చేయుటకు రూ.20.00 లక్షలు కేటాయించడము జరిగినది.

ఇట్టి సమావేశములో ప్రవేశపెట్టిన అజెండా అంశములను గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆమోదించడము జరిగింది.

ఈ సమావేశములో గౌరవ వైస్ చైర్ పర్సన్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, మునిసిపల్ కమీషనర్, తహసిల్దార్, మునిసిపల్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీయర్లు, టౌన్ ప్లానింగ్ అధికారి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్, సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags