కరెంటు వైర్ తగిలి వ్యక్తి మృతి
కరెంటు వైర్ తగిలి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన జంగిటి నవీన్ (32) కరెంట్ వైరు తగిలి మృతి చెందాడు అదే గ్రామానికి చెందిన జంగిటి చిన్న నరసయ్య @ఇచ్చన్న, జంతువుల వేట కోసమని నిన్న రాత్రి 7 గంటలకు, రాజేశ్వరావుపేట్ గ్రామ శివారులోని మహాజన్ వెంకటేశ్వర్ కి చెందిన మామిడి తోటకు, అంతకుముందే అడవి పందుల కోసం అని ఎలక్ట్రిక్ వైర్ తో ఫెన్సింగ్ వైర్ కి కరెంట్ షాక్ పెట్టి ఉంచగా, అది తెలియని మృతుడు జంగిటి నవీన్ అటువైపుగా వెళ్లి ఆ వైరు కాలికి తాకడం వలన మరణించినాడని పోలీసులు తెలిపారు.
నా భర్తను ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లి, అక్కడ ప్రమాదకరంగా కరెంట్ షాక్ పెట్టి ఉంచిన జంగిటి నరసయ్య@ ఇచ్చన్న అనునతనిపై చట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య జంగిటి రజిత ఫిర్యాదు మెరకి ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు, ఎస్సై అనిల్ గారు మరియు మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.