ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లు
On
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లు
సికింద్రాబాద్ డిసెంబర్ 21 ( ప్రజా మంటలు):
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ముస్లిం మైనార్టీ మహిళలకు ఉచితంగా ప్రభుత్వం కుట్టు మిషన్ లను అందజేస్తుందని బన్సీలాల్ పేట డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి పేర్కొన్నారు. సీసీ నగర్ కమ్యూనిటీ హాల్ లో శనివారం మహిళల నుంచి అప్లికేషన్లను స్వీకరించి ఆన్ లైన్ లో ఫ్రీ గా దరఖాస్తులను అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణ గణేష్ అబ్దుల్ కలీం పార్శి మహేష్, మునీర్, నస్రిన్ బేగం, శ్రీనివాస్, హరి, శ్రవణ్, వరుణ్, అబ్దుల్ ఖయ్యూం, సాయి సందీప్ పాల్గొన్నారు.
Tags